టీకా వచ్చేదాకా జాగ్రత్త : మోడీ

దేశ ప్రజలకు ప్రధాని హెచ్చరిక

PM Modi
PM Modi

New Delhi: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోందని, మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను హెచ్చరించారు.

చాలా రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతున్నప్పటికీ, కొన్నిరాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీకా వచ్చేవరకు వైరస్‌పై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈలోపు ప్రజలు మరింత అప్రమ త్తంగా ఉంటూ, సంరక్షణ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదు. మహారాష్ట్రలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఈ సమయంలో ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంలో నిర్లక్ష్యం చేయొద్దు. ‘ఔషధం వచ్చేవరకు అజాగ్రత్త వద్దు’ అని మోడీ హెచ్చరికచేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/