ఎయిమ్స్‌లో చికిత్స కు పయనం

ప్రత్యేక విమానంలో ఎంపీ రఘురామ ఢిల్లీకి

MP Raghurama krishna Raju

Secunderabad: సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బేగంపేట ఎయిర్​పోర్ట్ చేరుకుని ప్రత్యేక విమానంలో నేరుగా ఢిల్లీకి వెళ్లారు. తదుపరి చికిత్స కోసం ఎయిమ్స్‌లో రఘురామ చేరే అవకాశం ఉందని తెలిసింది. ఎంపీ రఘురామ కు సుప్రీం కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కేసు గురించి మీడియాతోగానీ, సోష‌ల్ మీడియాలో గానీ మాట్లాడ‌వ‌ద్ద‌ని సుప్రీంకోర్టు ష‌ర‌తు విధించింది.
కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై రఘురామపై ఏపీ సీఐడీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసి గుంటూరు జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఈనెల 21న సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/