సన్నీ లియోన్ ఫై అభిమానాన్ని చాటుకున్న చికెన్ షాప్ యజమాని

నటి నటులకు కొంతమంది వీరాభిమానులు ఉంటారు. వారి కోసం ఏ పనిచేయడానికైనా సిద్ధపడతారు. ఒక్కోసారి తమ ప్రాణాలను సైతం లెక్క చేయరు. తాజాగా సన్నీ లియోన్ కోసం ఓ అభిమాని ఏకంగా చికెన్ డిస్కౌంట్ లో పెట్టాడు. పోర్న్ స్టార్ గా వరల్డ్ వైడ్ గా పాపులార్టీ సాధించిన సన్నీ లియోన్..ఆ తర్వాత పోర్న్ సినిమాలు చేయడం మానేసి వెండితెర ఫై ఛాన్సులు కొట్టేసింది. హిందీ, తెలుగు , తమిళ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తనకంటూ అభిమానులను సొంతం చేసుకొని వారిని అలరిస్తూ వస్తుంది.

తాజాగా సన్నీ అంటే ఇష్టపడే ఓ అభిమాని సన్నీ కోసం ఓ వినూత్న పని చేసాడు. కర్నాటకలోని మాండ్యాకు చెందిన ప్రసాద్ కు సన్నీ అంటే ఎంతో ఇష్టం. దీంతో తన చికెన్ షాపులో సన్నీలియోన్ ఫ్యాన్స్ కు 10% డిస్కౌంట్ ఇస్తానని ప్రకటించాడు. అందుకు కొన్ని కండీషన్స్ పెట్టాడు. సన్నీలియోన్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వారందరూ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో సన్నీలియోన్ అకౌంట్స్ ఫాలో కావాలన్నాడు. వారి ఫోన్లలో సన్నీలియోన్ ఫొటోలు సేవ్ చేసుకోవాలని, సన్నీ ఫొటోలకు లైక్స్ కొట్టాలని, కామెంట్స్ చేయాలని సూచించారు. ఈ మూడు కండీషన్స్ ఫాలో అయిన వారికి మాత్రమే తమ షాపులో ఏడాది పొడవునా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందని స్పష్టం చేశాడు. దీంతో సన్నీ అభిమానులంతా ఆ షాప్ కు క్యూ కట్టడం మొదలుపెట్టారు.