సీఎం జగన్‌కు లేక రాసిన చంద్రబాబు

అమరావతి : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతి పక్ష నేత చంద్రబాబు సీఎం జగన్ కు లేఖ రాశారు. 81 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటు పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బతీయడమేనన్నారు. బోర్డులో అవినీతి పరులు, నేర చరిత్ర కలిగినవారు ఉన్నారన్నారు. రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసమే బోర్డు ఏర్పాటు చేసినట్లు విమర్శించారు. రెండేళ్లలో తిరుమల కొండపై అనేక అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని, వెంటనే సీఎం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, బోర్డు రద్దు చెయ్యాలని చంద్రబాబు ఆ లేఖలో సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/