‘సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం ఖాయం’
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి కేటిఆర్

Rajanna sircilla : మంత్రి కెటిఆర్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో పర్యటించారు.. ఈ సందర్భంగా ఆయన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను సూటిగా అడుగుతున్నానని ఈ రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్‌కు ప్రత్యేకంగా ఒక్క పైసా అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు
మతం పేరుతో రెచ్చగొట్టడం, చిల్లర రాజకీయం చేయడం సరికాదు. దమ్ముంటే అభివృద్ధిలో తమతో పోటీ పడాలన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించబోతోంది. అక్కడ బీజేపీ డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని వ్యాఖ్యానించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/