దుబ్బాక టిఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఖారారు

సోలిపేట సుజాత పేరు ఖరారు చేసిన సిఎం కెసిఆర్‌

solipeta-sujatha-to-contest-for-dubbaka-as-trs-candidate

హైదరాబాద్‌: దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గానికి జరుగనున్న ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థినిగా మాజీ ఎమ్మెల్యే, దివంగత సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పోటీ చేస్తారు. ఈ మేరకు సుజాత పేరును సిఎం కెసిఆర్‌ ఖరారు చేశారు. ‘సోలిపేట రామలింగారెడ్డి ఉద్యమ నేత. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. పార్టీ కోసం అంకిత భావంతోనూ పని చేశారు. తన తుది శ్వాస వరకూ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి శ్రమించారు. సోలిపేట ఫ్యామిలీ మొత్తం నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాలు పంచుకుంది. నియోజకవర్గంలో సోలిపేట కుటుంబానికి ప్రతి ఒక్కరితో అనుబంధం ఉంది. అభివృద్ధి దిశగా రామలింగారెడ్డి కన్న కలలను నెరవేరుస్తాం. అభివృద్ధి, సంక్షేమం కొనసాగడానికి ఆయన ఇంటి సభ్యులే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం సమంజసం. ఈ కారణంతోనే, అందరినీ సంప్రదించిన తరువాతనే సుజాతను ఎంపిక చేశాం’ అని సిఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.


తాజా అంతర్జాతయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/