ఇది మోడీ ప్రభుత్వం కాదు అటెన్షన్‌ డైవర్షన్‌ ప్రభుత్వం – కేటీఆర్

ktr tweet on modi government

కేంద్ర ప్రభుత్వం ఫై మరోసారి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ విమర్శలు కురిపించారు. కేంద్రంలో ఉన్నది మోడీ ప్రభుత్వం కాదు అటెన్షన్ డైవర్షన్ ప్రభుత్వమని కేటీఆర్ అన్నారు. అసలు దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర జరుగుతుందని , మండిపోతున్న పెట్రో ధరల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్రేనని కేటీఆర్‌ ఆరోపించారు.

దేశం కోసం ధర్మం కోసం అనేది బీజేపీ నినాదమైతే విద్వేషం, అధర్మం కోసం అనేది ఆ పార్టీ అసలైన రాజకీయ విధానమని కేటీఆర్ విమర్శించారు. హర్ ఘర్ జల్ అంటున్న కేంద్రం హర్ ఘర్ జహర్ (ప్రతి ఇంట్లో విషం) హర్ దిల్ మే జహర్ (ప్రతి ఒక్కరి మనసులో విషం) నింపే కుట్ర చేస్తోందని ఆరోపించారు. పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టే చిల్లర ప్రయత్నం చేస్తున్నారని, విష ప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సోషల్‌ మీడియా ద్వారా దేశంలోని.. సోషల్‌ ఫ్యాబ్రిక్‌ను దెబ్బతీసే కుతంత్రం జరుగుతోందన్నారు. ద్వేషం కాదు.. దేశం ముఖ్యమని, ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం ముఖ్యమని గుర్తుంచుకోవాలని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.