వెంకీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా ఆయనకు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. అభిమానులు , సినీ ప్రముఖులు వెంకీ కి విషెష్ అందిస్తూ తమ అభిమానాన్ని , ప్రేమను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ..వెంకీ కి బెస్ట్ విషెష్ అందజేసి ఆకట్టుకున్నారు.

‘‘నా సోదర సమానుడు, స్నేహితుడు వెంకటేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే నీ భవిష్యత్తు మరింత ఆనందంగా ముందుకు సాగాలి’’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా వెంకటేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం వెంకటేశ్‌ ‘ఎఫ్‌3’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అలాగే నెట్‌ఫ్లిక్స్‌ కోసం రామానాయుడు అనే వెబ్ సిరీస్ ను రానాతో కలిసి చేస్తున్నాడు.

My brother & dear friend @VenkyMama Thank you for always radiating warmth & always managing to put a smile on my face! Have a Wonderful birthday!! Many Many Happy Returns!! pic.twitter.com/OWd6epcIyk— Chiranjeevi Konidela (@KChiruTweets) December 13, 2021