కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కేటీఆర్ లేఖ

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీకి లేఖ రాశారు. తెలంగాణలో నాలుగు బొగ్గు గనుల వేలం ఆపాలన్నారు. నాలుగు గ‌నుల‌ను వేలం వేయ‌కుండా సింగ‌రేణికి కేటాయించాల‌ని మంత్రి కేటీఆర్ లేఖ‌లో కోరారు. సింగరేణిని దెబ్బతీస్తే బీజేపీ దెబ్బ తినడం ఖాయమని స్పష్టం చేశారు. సింగరేణి జోలికి వస్తే కార్మికుల డేగ ఢిల్లీకి తాకుతుందన్నారు. సింగరేణిని కేంద్రం ఉద్దేశ పూర్వకంగా చంపే కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/