మరోసారి మానవత్వం చాటుకున్న కేటీఆర్‌

KTR has once again shown his humanity

హైదరాబాద్‌ః మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోసారి మాన‌వ‌త్వం చాటుకున్నారు. రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వ్య‌క్తిని చికిత్స కోసం తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించిన ఉదంతమిది. ఈ సంఘ‌ట‌న వ‌రంగ‌ల్ లో చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్ర‌చారం కోసం వరంగల్ లేబర్ కాలనీ మార్గంలో వెళ్తున్న కేటీఆర్‌కు మార్గమధ్యంలో అంజయ్య (55) అనే వ్యక్తి రోడ్డు ప్ర‌మాదానికి గురై రోడ్డుపై కిందపడి ఉండ‌డం క‌నిపించింది.

తీవ్ర గాయాల‌తో ఉన్న‌ అతన్ని చూసి కేటీఆర్‌ తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇంత‌కుముందు కూడా ఇలాగే కేటీఆర్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన క్ష‌త‌గాత్రుల‌కు సాయం చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు.