కాంగ్రెస్‌ వాళ్లకు ఎన్నికలంటే ఏటీఎం అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

తెలంగాణ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజు కు పెరుగుతుంది. కౌంటర్లు విమర్శలు ,సైటైర్లు ఇవ్వడం లో దిట్ట అయినా మంత్రి కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ఫై అదే రేంజ్ లో విమర్శలు వర్షం కురిపించారు. బుధువారం దేవ‌ర‌కొండ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బిల్యా నాయ‌క్, ఆయ‌న అనుచ‌రులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే ర‌వీంద్ర నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో మంత్రి కేటీఆర్.. బిల్యా నాయ‌క్, ఆయ‌న అనుచ‌రుల‌కు గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

కాంగ్రెస్‌ వాళ్లకు ఎన్నికలంటే ఏటీఎం అని , గతంలో ఓటుకు నోటు అయితే.. ఇప్పుడు సీటుకు నోటు అని రేవంత్ ఫై విమర్శలు చేసారు.ఇప్పుడు ఎక్కడ చూడు రేవంత్‌ను రేవంత్‌ అనడం లేదు ..రేటెంత.. రేటెంత.. అంటున్నారని సైటైర్లు వేశారు. కొడంగల్‌లో ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి.. మళ్లీ పోటీ చేస్తున్నదని విమర్శించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతుంది. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. ఫ్లోరోసిస్‌ తప్ప ఏమిచ్చింది అని ప్రశ్నించారు.

కేసీఆర్‌తో మాత్ర‌మే గిరిజ‌నుల‌కు న్యాయం జ‌రుగుత‌ద‌ని చెప్పి బీఆర్ఎస్‌లో చేరుతున్నాన‌ని బిల్యా నాయ‌క్ చెప్పార‌ని కేటీఆర్ తెలిపారు. ఇవాళ వాస్తవం ఏందంటే.. ద‌శాబ్దాలు కొట్లాడితే ప‌రిష్కారం కాని స‌మ‌స్య‌లు మేం అడ‌గ‌క ముందే ప‌రిష్కారం చేశార‌ని బిల్యా నాయ‌క్ అన్నార‌ని పేర్కొన్నారు. కేసీఆర్ తండాల‌ను గ్రామ పంచాయ‌తీలుగా మార్చారు. 30 వేల మంది గిరిజ‌న బిడ్డ‌లు.. వార్డు మెంబ‌ర్ల నుంచి స‌ర్పంచ్‌ల వ‌ర‌కు ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎదిగారు. ఇది మాకు ఒక కానుక అని బిల్యా నాయ‌క్ తెలిపిన‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.