ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్ కామెంట్స్

KTR comments on three capitals of AP

ఏపీలో కాకపుట్టిస్తున్న మూడు రాజధానుల అంశం ఫై టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రస్తుతం తెలంగాణ లో మునుగోడు ఉప ఎన్నిక హోరు నడుస్తుంది. ఈరోజు తో ప్రచారం ముగుస్తుంది. ఈ క్రమంలో టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ వరుస ఇంటర్వ్యూ లు ఇస్తూ మునుగోడు ఉప ఎన్నిక లో టిఆర్ఎస్ భారీ విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో ఏపీ రాజకీయాల ఫై , నేతల ఫై , మూడు రాజధానుల అంశం ఫై స్పందించారు.

ఏపీలో అందరూ తనకు స్నేహితులేనని.. అందరితో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. సీఎం జగన్ తనకు మంచి మిత్రుడని , అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. అలాగే లోకేష్‌, పవన్ కళ్యాణ్‌ కూడా మిత్రులే. ఎవరితో నాకు పంచాయతీ లేదు. ముగ్గురు నాతో బాగానే ఉంటారు. చంద్రబాబు గారు నా కంటే వయసులో చాలా పెద్దవారు. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన ఎక్కడైనా కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరిస్తా అని తెలిపారు. మూడు రాజధానులను అక్కడి ప్రజలు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు నిర్ణయించుకునే అంశమన్నారు. తనకు కూడా అభిప్రాయాలు ఉంటాయని.. అవి బయటకు చెప్పకూడదంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.