ప్రజలు మన పార్టీని కూడా పూర్తిగా తిరస్కరించలేదుః కెటిఆర్‌

భువనగిరి లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కెటిఆర్‌

People have not completely rejected our party either.. KTR

హైదరాబాద్‌ః ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తప్పు చేశారనడం సరికాదని… ఇక నుంచి బిఆర్ఎస్ నేతలు అలాంటి మాటలు మాట్లాడవద్దని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిరామారావు అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో భువనగిరి లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజలు తప్పు చేశారని ఆ పార్టీ నేతలు వివిధ సందర్భాలలో అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక నుంచి మన నాయకులు ఎవరూ అలా మాట్లాడవద్దని సూచించారు.

తెలంగాణ వచ్చాక రెండుసార్లు మనల్ని గెలిపించింది అదే ప్రజలు అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు మన పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి, మనకు ఓట్ల తేడా కేవలం 1.8 శాతం మాత్రమే అన్నారు. పద్నాలుగు చోట్ల అతి స్వల్ప తేడాతో మన అభ్యర్థులు ఓడిపోయారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిఆర్ఎస్ మాత్రమే అన్నారు.