కేంద్రం ఫై పోరుకు సిద్దమైన తెరాస సర్కర్..ధర్నాలకు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపు

తెలంగాణ సర్కార్ చాల రోజుల తర్వాత పోరుకు సిద్ధమైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ధర్నాలు , నిరాహార దీక్షలు , ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెరాస పార్టీ..ఇప్పుడు కేంద్రం ఫై పోరుకు సిద్ధమైంది. తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుండడంతో తెరాస సర్కార్ ఉద్యమం చేపట్టబోతుంది. ఒక్క ధాన్యం కూడా మిగలకుండా కేంద్రం కొనుగోలు చేయాలనీ..ఆలా చేసే వరకు ఉద్యమం చేపట్టాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) పిలుపునిచ్చారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో.. ధర్నాలకు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.

కేవలం వరి కొనుగోలు మాత్రమే కాదు పెట్రో ధరలపై పోరుకు సిద్ధమవుతున్నారు. కేవలం కేసీఆర్ మాత్రమే కాదు జగన్ కూడా కేంద్రం ఫై పోరు కు సై అంటున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఒకేసారి పెట్రో ధరలపై పోరుకు దిగడం రెండు రాష్ట్రాల‌తోపాటు దేశ‌వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీజేపీయేతర, కాంగ్రెసేతర జాతీయ కూటమి ఏర్పాటు ప్రక్రియ మళ్లీ వేగం పుంజుకోనుందా అనే చర్చకు సీఎం కేసీఆర్ మ‌ళ్లీ తెరలేపారు.

పెట్రో ధరలకు సంబంధించి పన్నుల వసూలు విధానాలను మోడీ సర్కారు ఉద్దేశపూర్వకంగా తనకు అనుకూలంగా మార్చుకుందని.. పెట్రో ఆదాయాన్ని డివిజబుల్ పూల్‌లోకి రాకుండా సెస్‌లు, సర్‌ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నారని కేసీఆర్, జగన్ ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. పెట్రోల్ పై వ్యాట్ లో నిబంధనల ప్రకారం రాష్ట్రాలకు కూడా 41 శాతం వాటా లభిస్తుంది.కానీ మోడీ సర్కార్ కావాలనే వ్యాట్ కాకుండా అదనపు నిధులు సమకూర్చుకునే సెస్ విధానాన్ని పెట్రోపై అమలు చేస్తోంది. ఇది రాష్ట్రాల కడుపు కొట్టడమేనని కేసీఆర్, జగన్ ఆరోపిస్తున్నారు. మొత్తం మీద కేంద్రం ఫై పోరు కు సిద్ధమయ్యారు.