కృష్ణ పట్నం మందుపై విచారణ సోమవారానికి వాయిదా

నివేదికలు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు

Krishnapatnam Medicine case adjourned
Krishnapatnam Medicine case adjourned

Amravati: కృష్ణ పట్నం ఆనందయ్య మందును ప్రభుత్వమే పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఇదిలా ఉండగా ఆనందయ్య మందుపై అధ్యయనం జరుగుతోందని, ఈనెల 29న నివేదికలు వస్తాయని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. రిపోర్టులు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం, ప్రజలు మందు కావాలని ఎదురుచూస్తున్నారని, వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు తెలిపింది.

విచారణ సందర్బంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలు వినిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య తన మందును ఆయుర్వేద కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకోలేదని తెలిపింది. దీనిపై ఆనందయ్య తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ స్పందిస్తూ.. మందును ప్రభుత్వం గుర్తించాలని ఇప్పటికే పిటిషన్ వేశారని గుర్తుచేశారు. అంతేకాకుండా , మరోవైపు ఆనందయ్య మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశాలు ఇస్తుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కృష్ణయ్య ప్రశ్నించారు. దీంతో హైకోర్టు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/