డొమినికా పోలీసుల అదుపులో మెహుల్‌ చోక్సీ

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసు..

Mehul Choksi
Mehul Choksi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసు నిందితుడు మెహుల్‌ చోక్సీని డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన క్యూబాకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తుండగా.. అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆయనపై లుకౌట్ నోటీస్ జారీచేయడంతో డొమినికా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆంటిగ్వా అధికారులకు అప్పగించే పని జరుగుతూ ఉందని తెలిసింది. ఈ మేరకు సీబీఐ, ఈడీకి సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్, అంటిగ్వాకు డొమినికా ప్రభుత్వం సహకరిస్తుందని అంటిగ్వా ప్రధాని తెలిపారు. డొమినికాలోకి చోక్సీ అక్రమంగా ప్రవేశించారని, ఆయనను భారత్ కు పంపాలని అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ కోరారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/