బండ్ల గణేష్ భయపడ్డారా..?

మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ గా నామినేషన్ వేసిన బండ్ల గణేష్..ఇప్పుడు ఎన్నికల నుండి తప్పుకున్నట్లు తెలిపి అందరికి షాక్ ఇచ్చాడు. నాదైవ సమానులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయుల సలహామేరకు జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పుకున్నట్లు ట్విట్టర్లో ప్రకటించాడు. తాజాగా ప్రకాష్ రాజ్ అన్న నా దగ్గరకు వచ్చి పోటీ నుంచి విరమించుకోవాలని కోరడంతో తాను పోటీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. తన మద్దతు ప్రకాష్ రాజ్ ప్యానల్ కే అని తెలిపారు.

ప్రకాష్ రాజ్ తన ప్యానెల్‌లోకి జీవిత రాజశేఖర్‌ను తీసుకోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన బండ్ల గణేష్ ఆ సమయంలో అడ్డం తిరిగాడు. జీవిత మీద పోటిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బండ్ల గణేష్ బరిలోకి దిగాడు. తన ప్రచారాన్ని కూడా వినూత్న రీతిలో చేసుకున్నాడు. ఎవరు ఎవరికైనా ఓట్లు వేసుకోండి.. కానీ జనరల్ సెక్రటరీగా తనకు మాత్రం అందరూ ఓటు వేయండి అని నిన్నటి వరకు కోరాడు. అలాంటి గణేష్ సడెన్ గా తప్పుకోవడం ఫై అంత రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చిరంజీవి చెప్పడం వల్ల తప్పుకున్నాడా..లేక పవన్ కళ్యాణ్ ఏమైనా చెప్పాడా..లేక ఓడిపోతానని భయపడి తప్పుకున్నాడా..అని అంత మాట్లాడుకుంటున్నారు.

నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను. ⁦@actorsrikanth⁩ ⁦@prakashraaj⁩ 👍 pic.twitter.com/s6zx2MqCFL
— BANDLA GANESH. (@ganeshbandla) October 1, 2021