వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధంగా ఉన్నాం..సిఎం కెసిఆర్‌

ready-for-vaccine-distribution-says-cm-kcr

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోడి కరోనా పై పలు రాష్ట్రల సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ..ప్రజలకు ఇచ్చేందుకు కరోనా వ్యాక్సిన్ పంపిణీకి తాము సిద్ధంగా ఉందని అన్నారు. అయితే ఇది ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది నిర్ధారించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీకి అనుగుణమైన కార్యాచరణ రూపొందించామని అన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండొచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మొదటగా కొందరికి కొన్ని డోసుల చొప్పున ఇవ్వాలి సూచించిన ఆయన 15 రోజులు పరిశీలించిన తర్వాత మిగతావారికి ఇవ్వాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కెసిఆర్ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన కోల్డ్ చైన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. మొదట ఆరోగ్య కార్యకర్తలకు, కోవిడ్‌పై ముందుండి పోరాడుతున్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి, అరవై ఏళ్ళు దాటిన వారికి, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పారు. దీని కోసం జాబితాను రూపొందించాలని ఆదేశించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/