అదిరిపోయే వంటకాలతో ముగిసిన కృష్ణం రాజు సంస్మరణ సభ

మొగల్తూరులో కృష్ణం రాజు సంస్మరణ సభ ఘనంగా జరిగింది. రెబెల్ స్టార్ కృష్ణం రాజు సెప్టెంబర్ 11న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణం రాజు మరణ వార్త యావత్ సినీ లోకాన్నే కాదు రాజకీయ నేతలను సైతం షాక్ కు గురి చేసింది. కృష్ణం రాజు ఇక లేరు అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మరణించి 20 రోజులు కావొస్తున్నా ప్రతి రోజు ఆయన గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇక ఈరోజు మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రభాస్ తో పాటు కుటుంబ సభ్యులంతా కూడా రావడంతో మొగల్తూరు అభిమానులతో పోటెత్తింది. దాదాపు లక్ష మందికి నోరూరించే వంటకాలను వడ్డించారు. టన్నుల కొద్దీ వంటకాలను వండారు. వంటకాల్లో ప్రధానంగా… 6 టన్నుల మటన్ బిర్యానీ, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు, 1 టన్ను రొయ్యల ఇగురు, 1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను బొమ్మిడాయల పులుసు, 2 లక్షల బూరెలు తయారు చేశారు. మొత్తం 22 రకాల నాన్ వెజ్ వంటకాలని వండించారు. కార్యక్రమానికి వచ్చిన వారంతా కడుపు నిండా తినమని స్వయంగా తినమని ప్రభాస్ తెలిపాడు.

తమ అభిమాన హీరోని చూడ‌టానికి ఫ్యాన్స్ లోప‌లికి రావ‌టానికి ప్ర‌య‌త్నించారు. దీంతో అక్క‌డ తోపులాట జ‌రిగింది. అయితే పోలీసులు వెంట‌నే రియాక్ట్ అయ్యి.. అక్కడున్న వారిని చెద‌ర‌గొట్టారు. 12 ఏళ్ల త‌ర్వాత ప్ర‌భాస్ మొగ‌ల్తూరులో అడుగు పెట్టడంతో ఫ్యాన్స్ భారీ స్థాయిలో అక్క‌డిచి వ‌చ్చారు. కొంద‌రు అభిమానులు అయితే బైక్ ర్యాలీని కూడా నిర్వ‌హించారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా బందోబ‌స్తును ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.