‘ టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు’ నుండి రేణు దేశాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్

మాస్ రాజా రవితేజ నటిస్తున్న టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు నుండి రేణు దేశాయ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న రవితేజ..వాటిలో టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు మూవీ ఒకటి. వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌ వారు నిర్మిస్తున్నారు.

1970లో స్టూవ‌ర్టుపురంలోని టైగ‌ర్ నాగేశ్వ‌రరావు అనే ఒక దొంగ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో రేణు దేశాయ్ హేమ‌ల‌త ల‌వ‌ణం అనే ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు ఆమె తాలూకా ఫస్ట్ లుక్ ను మేకర్స్ గురువారం రిలీజ్ చేసారు. 18 ఏళ్ల త‌ర్వాత బిగ్ స్క్రీన్‌కు రీ ఎంట్రీ ఇస్తున్న‌ రేణూదేశాయ్‌కు స్వాగ‌తం. అంద‌రూ ఎంతో ఇష్ట‌ప‌డే రేణూ దేశాయ్ టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు చిత్రంలో హేమ‌ల‌త ల‌వ‌ణం పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు అంటూ మేక‌ర్స్ ట్వీట్ చేశారు. టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు బాలీవుడ్ బ్యూటీ కృతిస‌న‌న్ సోద‌రి నుపుర్ స‌న‌న్ టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతోంది.

ప్రస్తుతం రవితేజ ” ధమాకా” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనిలో ఉన్నాడు. ఆ తరువాత “రావణాసుర” సినిమా లైన్ లో ఉంది. ఈ రెండు చిత్రాల తరువాత ” టైగర్ నాగేశ్వరరావు” వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.