బిగ్ బాస్ ద్వారా ఆర్జే కాజల్ గట్టిగానే రెమ్యూనరేషన్ తీసుకుందట..

బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ లో టాప్ 5 లో చేరుతుందని అంత అనుకుంటున్నా వేళా ఆర్జే కాజల్ కు బిగ్ బాస్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఆమెను ఇంటికి పంపించి మానస్ ను టాప్ 5 లో ఉంచాడు. ఇక ఆర్జే కాజల్ పద్నాలుగు వారాలకు గాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నదని గురించి అంత మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఆర్జే కాజల్ వారానికి రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకుందట. అంటే ఆమె 14 వారాలు వారాల పాటు హౌస్‌లో కొనసాగింది. కాబట్టి మొత్తం మీద ఆమెకు రూ. 30 లక్షలకు పైగానే రెమ్యూనరేషన్‌గా వచ్చినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన రోజు నుంచే కాజల్ హైలైట్ అవుతూ వచ్చింది. ఇందులో తన ఆటతీరుతోనేమో కానీ.. తరచూ ఎవరో ఒకరితో గొడవలు పడడం వల్ల హాట్ టాపిక్ అయ్యేది. షోలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరితోనూ ఆమె ఎప్పుడో అప్పుడు గొడవలు పడుతూనే ఉంది. తనపై ఎన్ని విమర్శలు వచ్చిన పట్టించుకోకుండా ఉండేది. ఎలాగైనా ఫినాలేలో అడుగు పెట్టాలన్న పట్టుదలతో గేమ్స్ ఆడేది. ఒక్కసారి కెప్టెన్ కాకున్నా.. తన స్నేహితుల కోసం గట్టిగానే కష్టపడేది. దీంతో సన్నీ, మానస్‌లకు చాలా హెల్ప్ చేసింది. ఇలా హౌస్‌లో వాళ్లిద్దరి స్నేహాన్ని మాత్రం కాజల్ గెలుచుకుంది.