తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

ఏపి ప్రజలకూ శుభాకాంక్షలు తెలిపిన మోడి

President Kovind, PM Modi
President Kovind, PM Modi

న్యూఢిల్లీ: నేడు తెలంగాణ రాష్ట్రా అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడి శుభాకాంక్షలు తెలిపారు.


‘తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. గొప్ప తెలుగు చరిత్ర, సాహిత్యం పట్ల దేశం యావత్తు గర్వపడుతోంది. బాగా కష్టపడే స్వభావమున్న తెలంగాణ ప్రజలు దేశాభివృద్ధి ఎంతో సాయం చేశారు. రానున్న రోజుల్లోనూ తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుందని ఆశిస్తున్నాను’ అని రామ్‌నాథ్ కోవిండ్ ట్వీట్ చేశారు.


తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మోడి ట్వీట్లు చేశారు. ‘తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి, శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను’ అని చెప్పారు.

మరోవైపు ప్రధాని మోడి ఏపి ప్రజలకు కూడా శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. కృషి, పట్టుదల, ఈ సంస్కృతికి మారు పేరు. దేశ పురోభివృద్ధిలో ఈ రాష్ట్ర భూమిక ఎంతో గణనీయమైనది. ఈ రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను’ అని మోడి ట్వీట్ చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/