ఎయిర్ ఏషియాకు 20 ల‌క్ష‌ల జ‌రిమానాః డీజీసీఏ

airasia-flight-makes-emergency-landing-kolkata
airasia-flight

న్యూఢిల్లీః ఎయిర్ ఏషియా విమాన‌యాన సంస్థ‌కు 20 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు. పైల‌ట్ శిక్ష‌ణ‌లో లోపం ఉన్న‌ట్లు ఏవియేష‌న్ రెగ్యులేట‌రీ డీజీసీఏ సంస్థ పేర్కొన్న‌ది. పైల‌ట్ నైపుణ్యం చెకింగ్ స‌మ‌యంలో ఎయిర్ ఏషియా పైల‌ట్ త‌న స్కిల్స్‌ను ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయిన‌ట్లు డీజీసీఏ తెలిపింది. అంత‌ర్జాతీయ సివిల్ ఏవియేష‌న్ సంస్థ రూల్స్ ప్ర‌కారం ఆ పైల‌ట్ ప‌ర్ఫార్మ్ చేయ‌లేక‌పోయాడు. దీంతో నిబంధ‌న‌లు ఉల్లంఘించిన కేసులో ఎయిర్ ఏషియాపై డీజీసీఏ జ‌రిమానా వేసింది.

ఎయిర్ ఏషియాకు చెందిన ట్రైనింగ్ హెడ్‌ను కూడా మూడు నెల‌ల పాటు ఆ పొజిష‌న్ నుంచి తొల‌గించారు. డీజీసీఏ ఏవియేష‌న్ రూల్స్ ఉల్లంఘించిన కేసులో అత‌నిపై కూడా వేటు వేశారు. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 8 మందిపై మూడు ల‌క్ష‌ల చొప్పున ఫైన్ వేశారు. రెగ్యులేట‌రీ నిబంధ‌న‌లను విస్మ‌రించినందుకు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోరాదు అని డీజీసీఏ విమాన సంస్థ‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లిఖిత‌పూర్వ‌క స‌మాధాన్ని ప‌రిశీలించిన త‌ర్వాత జ‌రిమానా వేసిన‌ట్లు అధికారులు తెలిపారు.