మంత్రి తలసానితో కౌశిక్ రెడ్డి భేటీ

హైదరాబాద్ : హుజూరాబాద్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే కౌశిక్ రెడ్డి శుక్రవారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని ఆయనను అభినందించారు. అనంతరం కొద్దిసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న నేపద్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసందర్భంగా మంత్రి తలసానిని కలిసిన వారిలోఎమ్మెల్యేలు దానం నాగేందర్, బిగాల గణేష్ గుప్తా లు కూడా ఉన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/