బిఆర్ఎస్ లోకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..?

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..అతి త్వరలో బిఆర్ఎస్ పార్టీ లో చేరబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తో మనస్థాపం చెందిన కోటంరెడ్డి..వైస్సార్సీపీ పార్టీ లో ఉండలేను అంటూ..అధిష్టానం ఫై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. త్వరలోనే పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. ఈ క్రమంలో కోటంరెడ్డి టీడీపీ లో చేరుతారనే వార్తలు జోరుగా ప్రచారం అవుతూ వస్తున్నాయి. కానీ కోటంరెడ్డి మాత్రం బిఆర్ఎస్ లో చేరేందుకు డిసైడ్ అయినట్లు తాజాగా వార్తలు జోరు అందుకున్నాయి.

ఇప్పటికే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి తో బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని సమాచారం. బీఆర్ఎస్‌లో చేరాలని కోటంరెడ్డికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఆహ్వానం పంపిందట. దీనికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.. కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ తో పని చేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.. చెప్పినట్లు సమాచారం అందుతోంది. దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. ఒకవేళ శ్రీధర్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరితే టీడీపీ కి షాక్ తగిలినట్లే. టిఆర్ఎస్ ను కాస్త బిఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్..ప్రస్తుతం జాతీయ రాజకీయాల ఫై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఇతర రాష్ట్రాల్లోనూ బిఆర్ఎస్ జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీ ఫై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పదుల సంఖ్య లో పలువురు నేతలు ఏపీ నుండి బిఆర్ఎస్ లో చేరారు.