తిరుపతి శ్రీకృష్ణ నగర్‌లో ఏంజరుగుతుందో అర్థంకావడం లేదు..భయాందోళనలో ప్రజలు

తిరుపతి శ్రీకృష్ణ నగర్‌లో ఏంజరుగుతుందో అర్థంకావడం లేదు..భయాందోళనలో ప్రజలు

తిరుపతి శ్రీకృష్ణ నగర్‌లో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కాలనీ లో సడెన్ గా భూమిలో ఉన్న వాటర్ ట్యాంక్ లు బయటకు రావడం..నేలఫై ఉన్న ఇల్లు రెండు, మూడు అడుగుల లోతుకు వెళ్తుండడం జరుగుతున్నాయి. దీంతో కాలనీ వాసులు భయం భయం గా బ్రతుకుతున్నారు.

రెండు రోజుల క్రితం శ్రీకృష్ణ నగర్ లోని ఓ ఇంట్లో 18 సిమెంట్ రింగులతో భూమిలో వాటర్ ట్యాంక్ నిర్మించారు. గురువారం ఆ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఇంటి యజమాని అందులోకి దిగి శుభ్రం చేస్తుండగా.. ఒక్కసారిగా ట్యాంక్ పైకి లేచింది. ట్యాంక్ పైకి లేస్తుండటంతో.. అందులో ఉన్న మహిళ తీవ్ర భయాందోళనకు గురై.. ట్యాంక్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. ఈ ఘటన అందర్నీ ఆశ్చర్య నికి గురి చేసింది.

ఇదే అనుకుంటే ఈరోజు వరుసగా ఇళ్లు కుంగుతున్నాయి. ఏకంగా 18 ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. బీటలు వారాయి. దీంతో పలు బిల్డింగ్‌లో ఎప్పుడు కూలుతాయో తెలియక స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తిరుపతి నగరాన్ని వర్షాలు ఇటీవలే ముంచెత్తాయి. ఈ వార్షాలకు నీరు నిల్వ ఉండడంతో వాటర్‌ ట్యాంక్‌ పైకి వచ్చిందని అంత అనుకున్నారు. ఇక నిన్న సాయంత్రం తిరుపతి వాసులను భూ ప్రకంపనలు టెన్షన్‌ పెట్టాయి. ఇంతలోనే ఇప్పుడు ఉన్నట్టుగా ఇళ్లు భూమిలోకి కుంగుతున్నాయి. దీంతో అసలు తిరుపతి నగరంలో ఏంజరుగుతుందో..ఏంజరగబోతుందో అని భయపడుతున్నారు. ఇన్ని జరుగుతున్న ఏ అధికారి కానీ , రాజకీయ నేత కానీ వచ్చి అడగలేదని స్థానికులు మండిపడుతున్నారు.