ఓమిక్రాన్ ఎఫెక్ట్ : తెలంగాణలో ఫస్ట్ లాక్ డౌన్..

తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ వైరస్ చాపకింద నీరులా రోజు రోజుకు ఉదృతం అవుతుంది. ఒకటి, రెండే కాదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 38 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదైన గూడెం గ్రామంలో లాక్‌డౌన్ విధించారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన గూడెం వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. దీంతో అతడి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు. వారి శాంపిల్స్ కూడా సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. అయితే తాజాగా ఒమిక్రాన్ సోకిన వ్యక్తి తల్లి, చెల్లికి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో గూడెం గ్రామంలో లాక్ డౌన్ విధించారు.

పదిరోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. గ్రామస్థులు బయటకు వెళ్లొద్దన్నారు. అలాగే బయట వ్యక్తులు కూడా గూడెంలోకి రావొద్దని సూచించారు. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన వ్యక్తి ఆరుగురు కుటుంబ సభ్యులను, బయటి వారిని మరో ఏడుగురికి కాంటాక్ట్ అయ్యాడు. దీంతో వారందర్నీ క్వారంటైన్లోకి పంపారు. కాగా వారిలో ఇద్దిరికి పాజిటివ్ అని తేలింది. వారికి సోకింది ఒమిక్రాన్ వేరియెంటేనని అధికారికంగా నిర్ధారణ అయితే.. తెలంగాణలో హైదరాబాద్ వెలుపల ఒమిక్రాన్ తొలి లోకల్ ట్రాన్స్‌మిషన్ కేసు ఇదే కానుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఒమిక్రాన్ సోకిన వ్యక్తికి చికిత్స అందిచిన డాక్టర్‌కు సైతం ఒమిక్రాన్ సోకిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 38కి చేరింది. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 12 మందిలో ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరిలో వేరియంట్ గుర్తించారు. ఇప్పటి వరకు రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఆరుగురిలో ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 31 మందిలో వైరస్ గుర్తించారు. ఒకరికి కాంట్రాక్ట్ ద్వారా ఒమిక్రాన్ సోకినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.