మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లానని తేల్చి చెప్పిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కోమటి రెడ్డి రాజగోపాల్ బ్రదర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లానని తేల్చి చెప్పారు. ఏఐసీసీ నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరుకాకపోవటంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. రేవంత్ రెడ్డి వర్గం తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. తనతోపాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలను అగౌరవపరచడం ఆ వర్గానికి అలవాటుగా మారిందన్నారు.

అనుభవం లేని వారికి బాధ్యతలు ఇవ్వడం వల్లే పార్టీ వీక్ అయిందని వెంకట్ రెడ్డి ఆరోపించారు. 30ఏళ్ల నుంచి పార్టీకి నిజాయితీగా సేవలందిస్తున్న నేతలను హోంగార్డులుగా పోల్చుతున్నారని.. ఆత్మగౌరవం కాపాడుకోవడానికే మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదని తెలిపారు. మాణిక్యం ఠాగూర్ వైఖరి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోతుందని కోమటిరెడ్డి ఆరోపించారు. తక్షణమే మాణిక్యం ఠాగూర్ ను తప్పించి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా కమల్నాథ్ వంటి నేతలను నియమించాలన్నారు. 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన తనకు మాణిక్కం ఠాగూర్ వల్ల అన్యాయం జరిగిందన్నారు. నేను పార్టీ మారే ప్రసక్తే లేదని మరోమారు క్లారిటీ ఇచ్చారు.