30 వేలకు పైగా మెజార్టీ తో ఈటెల విజయం సాదించబోతున్నారు – కోమటిరెడ్డి

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ లెక్కింగ్ కొనసాగుతుంది. మొత్తం 22 రౌండ్ల కు సంబదించిన ఫలితాలు రావాల్సి ఉండగా..ఇప్పటివరకు 14 రౌండ్ల ఫలితాలు వచ్చాయి. వీటిలో కేవలం రెండు రౌండ్ లలో మాత్రమే తెరాస ఆధిక్యం చూపించగా..మిగతా 12 రౌండ్స్ లలో బిజెపి హావ కనిపించింది. ఈ తరుణం లో కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

హుజూరాబాద్‌లో ఈటల విజయం తథ్యమని ఆయన అన్నారు. ముప్పై వేలకు పైగా మెజార్టీతో ఆయన విజయం సాధించబోతున్నారని కోమటిరెడ్డి చెప్పారు. ఉప ఎన్నిక కోసం ఈ ఐదు నెలల్లో అధికార టీఆర్‌ఎస్ 5 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం టీఆర్‌ఎస్ పార్టీకి చెంపపెట్టు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పరోక్షంగా మద్దతునిచ్చిందని ఆయన సంచలనానికి తెరతీశారు. శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్లు ఈటలకు మద్దతు ఇవ్వక తప్పలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.