సంబరాలు మొదలుపెట్టిన ఈటెల వర్గం

హుజురాబాద్ ఉప ఎన్నిక లెక్కింపులో ఈటెల తన హావ చూపిస్తున్నారు. తొలుత 753 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించారు. అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 22 రౌండ్లలో హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్లు లెక్కించనున్నారు. ఇప్పటి వరకు ఏడు రౌండ్లు పూర్తి కాగా..ఈ ఏడు రౌండ్ లలో బిజెపి ఆధిక్యం కనపరిచింది.

ఆరో రౌండ్లో ఈటల 3,186 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. భాజపా 4,656, తెరాస 3,639, కాంగ్రెస్ 180 ఓట్లు వచ్చాయి. ఆరు రౌండ్లు ముగిసేసరికి 26,983, తెరాసకు 23,797 ఓట్లు నమోదయ్యాయి. కాంగ్రెస్​కు ఆరు రౌండ్లు ముగిసేసరికి 992 ఓట్లు వచ్చాయి. దీంతో ఈటల వర్గం , బిజెపి కార్య కర్తలు సంబరాలు మొదలుపెట్టారు. కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలు చేసిన గ్రామం శాలపల్లిలోనూ కమలం పార్టీనే ముందంజలో నిలువడం విశేషం. ప్రస్తుతం వీణవంక మండలం ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.