జగన్ రికార్డు బ్రేక్ చేసిన సుధా

వైసీపీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరుతో ఉన్న రికార్డు ను బద్వేల్ అభ్యర్థి సుధా బ్రేక్ చేసారు. 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్.. టీడీపీ అభ్యర్థి సింగా సతీష్ కుమార్ రెడ్డిపై 90,110 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే ఆ రికార్డ్‌ను బద్వేల్‌ వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ బ్రేక్ చేసేశారు. 90,550 ఓట్ల మెజార్టీతో బద్వేల్ ఉప ఎన్నిక లో భారీ విజయం సాధించారు సుధా. దీంతో జగన్ పేరుతో ఉన్న రికార్డు ను బ్రేక్ చేసిన అభ్యర్థి గా సుధా వార్తల్లో నిలిచారు.

వాస్తవానికి బద్వేల్ ఎన్నికలో లక్ష మెజార్టీ వస్తుందని.. ఇదో బంపర్ మెజార్టీ కావాలని వైసీపీ అధిష్టానం అనుకున్నప్పటికీ.. అనుకున్న టార్గెట్‌ను దాదాపు చేరుకోగలిగింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడంతో బాగా వైసీపీకి కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి ప్రతి రౌండ్‌లోనూ వైఎస్సార్‌సీపీ ఆధిక్యతతో దూసుకుపోయింది. వైఎస్సార్‌సీపీకి మొత్తం 1,12,211 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 21,678 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు మొత్తం 6,235ఓట్లు వచ్చాయి. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ వైఎస్సార్‌సీపీ మెజారిటీ ఓట్లు దక్కించుకుంది.

ఈ సందర్భాంగా సుధా మాట్లాడుతూ..బీజేపీ, కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోయాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా డిపాజిట్లు గల్లంతయ్యాయి. బద్వేల్ ప్రజలు, సీఎం జగన్‌ వెంటే ఉన్నారని డాక్టర్‌ సుధ అన్నారు. గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో గెలిపించారని.. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని డాక్టర్‌ సుధ పేర్కొన్నారు.