మోహన్ బాబు వార్నింగ్..వైసీపీ నేతలకేనా..?

These awards are a great honor for Gaddar’s hard work and sacrifices: Mohan Babu

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. గత కొద్దీ రోజులుగా ఆయన రాజకీయలంగా దూరంగా ఉంటూ తన వ్యాపారాలతో బిజీ గా ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది ఆయన పేరును వాడుకుంటూ రాజకీయంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు వారిపై సీరియస్ అయ్యాడు.

కొందరు తన పేరును రాజకీయంగా వాడుకుంటున్నారని మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.”మనం అనేక రకాల భావాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడటంలోనే మనం దృష్టి పెట్టాలిగానీ సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి వారి వారి అనుబంధం సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తూ శాంతి సౌభ్రాతృత్వాన్ని వ్యాపింపజేయడంలో అందరూ బద్ధులై ఉందామని కోరుకుంటున్నాను. నా విజ్ఞప్తిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరిస్తున్నాను’’ అని మోహన్ బాబు లేఖలో పేర్కొన్నారు.

మోహన్ బాబు గత ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మద్దతు పలికారు. టీడీపీ ప్రభుత్వం తన విద్యాసంస్థకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలు చెల్లించలేదని ధర్నాలు చేశాడు. అనంతరం వైసీపీ పార్టీ అధికారంలోకి రాగా… ఆయనకు సముచిత స్థానం లభించలేదని ఆయన భావించి వైసీపీ కి దూరం అయ్యారు. రీసెంట్ గా ప్రముఖ సినీ నటుడు , వైసీపీ నేత ఒకరు మోహన్ బాబు పేరును బయటకు తీసుకొచ్చారు. మరి దానిపైనే మోహన్ బాబు సీరియస్ అయ్యాడని , అతడికి ఈ వార్నింగ్ ఇచ్చినట్లు అంత మాట్లాడుకుంటున్నారు.