కోడికత్తి కేసు..నిరాహారదీక్షకు దిగిన శ్రీను తల్లి, సోదరుడు

ఐదేళ్లుగా జైల్లోనే మగ్గిపోతున్న కోడికత్తి శ్రీను

kodi-kathi-srinu-mother-and-brother-hunger-strike

విజయవాడః గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో శ్రీను జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా ఆయన విశాఖ జైల్లోనే మగ్గిపోతున్నాడు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు నిరాహారదీక్షకు దిగారు. దీక్షకు పోలీసుల అనుమతులు లేకపోవడంతో విజయవాడలోని ఇంట్లోనే నిరశన దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా శ్రీను తల్లి సావిత్రి మాట్లాడుతూ… తమకు న్యాయం జరిగేంత వరకు దీక్ష చేపడతామని చెప్పారు. ఈ కేసులో కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్వోసీ ఇచ్చి కేసును ఉపసంహరించుకోవాలని అన్నారు. తమకు ప్రజా సంఘాలు మద్దతును ఇవ్వాలని కోరారు. మరోవైపు విశాఖ సెంట్రల్ జైల్లో శ్రీను నిరాహార దీక్షకు కూర్చోనున్నాడు.