జై భీమ్ భారత్ పార్టీలో చేరిన కోడికత్తి శ్రీను

ఏపీ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గత ఎన్నికల సమయంలో వివేకా హత్య, సీఎం జగన్ ఫై విశాఖ ఎయిర్పోర్టులో దాడి ఘటనలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ఈ కేసుల్లో ప్రధాన నిందితులు దస్తగిరి, శ్రీను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం మరింత హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ జైభీమ్ పార్టీలో చేరారు.

గతంలో జగన్ ఫై విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి చేసిన జనుపల్లి శ్రీనివాసరావు జై భీం భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. బడుగు, బలహీన వర్గాల తరఫున గళం వినిపిస్తానని శ్రీను చెప్పుకొచ్చారు. అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీను పోటీ చేస్తారని అధ్యక్షుడు శ్రవణ్ తెలిపారు.