వెయ్యి మంది మోడీలు వచ్చినా జగన్ ను ఓడించలేరు: నాని

pm-modi-speech-in-sangareddy-today

ఏపీలో జగన్ ను గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావడం తో జగన్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన జగన్..ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. ఇదే క్రమములో అధికార పార్టీ నేతలు సైతం తమ దూకుడు ను పెంచుతున్నారు.

తాజాగా మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. జైలుకు వెళ్లకుండా ఉండేందుకే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ‘వెయ్యి మంది మోదీలు, లక్ష మంది బాబులు, కోటి మంది పవన్ కళ్యాణ్ు వచ్చినా.. దేవుడి ఆశీస్సులు, ప్రజాబలం ఉన్న జగన్ను ఓడించలేరు’ అని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని పోరాటాలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఫైరయ్యారు.