సజ్జల వ్యాఖ్యలను కెసిఆర్, కెటిఆర్, హరీశ్ ఖండించలేదుః రేవంత్

అంతా పక్కా ప్రణాళికతోనే జరుగుతోందని విమర్శ

tpcc-chief-revanth-reddy

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మళ్లీ కలిస్తే మంచిదేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను ఇప్పటికే పలువురు నేతలు ఖండించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… సజ్జల వ్యాఖ్యలను సిఎం కెసిఆర్‌, మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు ఖండించలేదని విమర్శించారు. సజ్జల వ్యాఖ్యలకు కెసిఆర్ మద్దతు ఉందని ఆరోపించారు.

అంతా పక్కా ప్రణాళికతోనే జరుగుతోందని… తెలంగాణ ప్రజలకు ఇది కెసిఆర్ చేస్తున్న ద్రోహమని విమర్శించారు. తెలంగాణ మేధావులు, అమరుల కుటుంబాలు, ప్రజలు కెసిఆర్ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చారని… ఈ రోజు నుంచి కెసిఆర్ కు తెలంగాణ పేగు బంధం తెగిపోయిందని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/