సరోజ్ ఖాన్ కన్నుమూత

తెల్లవారుజామున 2.30 గంటలకు కన్నుమూత

Bollywood choreographer Saroj Khan passes away

మంబయి: బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) ఈరోజు తెల్లవారుజామున 2.30 గంటలకు కన్నుమూశారు. గత నెల 20న ముంబయిలోని గురునానక్ ఆసుపత్రిలో శ్వాస సమస్యలతో చేరిన ఆమె, ఈరోజు గుండెపోటుతో మరణించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె బాలీవుడ్ లో మూడు సార్లు జాతీయ అవార్డులను స్వీకరించిన నృత్య దర్శకురాలిగా గుర్తింపు పొందారు. పలు సూపర్ హిట్ పాటలకు నృత్యాలు సమకూర్చారు. కాగా ఆమె మృతిపై బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఓ లెజండరీ నృత్య దర్శకురాలని, ఆమె చేసిన అన్ని సాంగ్స్ తనకు ఇష్టమైనవేనని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆమె మృతి భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటని, దాదాపు 2000 పాటలకు పైగా నృత్య దర్శకత్వం వహించిన ఆమె లేని లోటు తీర్చలేనిదని రితీశ్ దేశ్ ముఖ్ అన్నారు. పలువురు ఆమెతో తమకున్న అనుభవాలను పంచుకుంటున్నారు. కాగా ఆమెకు కరోనా సోకలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈరోజు ఉదయమే సరోజ్‌ఖాన్‌ అంత్యక్రియలు కూడా నిర్వహించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/