నీతి కథ : సమయపాలన

NEETI KADHA

రాజు 10వ తరగతి చదువుతున్నాడు. అతడు చదువులో తెలివైన విద్యార్థి. కానీ అతనిలో ఒక బలహీనత ఉంది. పాఠశాలకు రోజూ ఆలస్యంగా వచ్చేవాడు. రోజూ ఆలస్యంగా లేవడమే గాక అత్యంత బద్ధకంగా తయారు అయ్యేది. అమ్మా నాన్నలు ఎంత ప్రయత్నించినా అతనిలో మార్పు తేలేకపోయారు. ఉపాధ్యాయులు ఎంత తిట్టినా, బుజ్జగించి చెప్పినా రాజులో మార్పు శూన్యం.

స్నేహితులు తొందరగా పాఠశాలకు రమ్మని సలహా ఇస్తే వారిపై ఆరిచేవాడు. వారికి దూరంగా ఉండేవాడు. ఇతనిలో మార్పు తీసుకురావాలని అప్పుడప్పుడు గణిత ఉపాధ్యాయులు ఎంత తిట్టినా, బుజ్జగించి చెప్పినా రాజులో మార్పు శూన్యం. స్నేహితులు తొందరగా పాఠశాలకు రమ్మని సలహా ఇస్తే వారిపై అరిచేవాడు. వారికి ఊరంగా ఉండేవాడు.

ఇతనిలో మార్పు తీసుకురావాలని అప్పుడప్పుడు గణిత ఉపాధ్యాయుడు సమయపాలన వ్ల ఉపయోగాలను చెప్పేవాడు. మన వాడు ఈ చెవితో వింటూ ఆ చెవితో వదిలేసేవాడు. కాలం గడుస్తుంది. ఇంతలో ఆ గణిత ఉపాధ్యాయునికి వేరే ప్రాంతానికి బదిలీ అయింది. ఆ స్థానంలో ఇంకొకరు రాలేదు. అంత మంచి గణిత ఉపాధ్యాయులు బదిలీ అయినందుకు ఎంతో మంది విద్యార్థులు బాధపడ్డారు.

అయితే స్థానికంగా ఉన్న ఓ యువకుని తాత్కాలిక గణిత ఉపాధ్యాయునిగా నియమించారు. అయితే ఆ గణిత ఉపాధ్యాయుడు ప్రతిరోజు పీరియడుకు ఆలస్యంగా వచ్చేవాడు. ఒకటి రెండు లెక్కలు చెప్పేసరికి మరో పీరియడ్‌ బెల్‌ అయ్యేది. ఇలా సిలబస్‌ వెనుకబడింది. ఎవ్వరూ అడగడం లేదు. ఉండబట్టలేక ఒకరోజు రాజు అడిగాడు. ‘గురువ్ఞ గారూ! మీరిలా రోజూ ఆలస్యంగా రావడం వల్ల మా సిలబస్‌ వెనుకబడుతుంది. అది మా భవిష్యత్తునే దెబ్బ తీస్తుంది అని. ‘ఓహో! నువ్ఞ్వ నాకు నీతులు చెబుతున్నావా? నువ్ఞ్వ ఎన్నడైనా పాఠశాలకు సమయానికి వచ్చావా అని గణిత ఉపాధ్యాయుడు ప్రశ్నించాడు.

మిగతా పిల్లలంతా ఫక్కున నవ్వారు. సిగ్గుతో తల దించుకున్నాడు రాజు. ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం రాజు తమ్ముడు రంగకు విపరీతంగా కడుపునొప్పి వచ్చింది. డాక్టర్‌ గారు సాయంత్రం 6 గంటల నుంచి పెషెంట్లను చూస్తాడు.

రంగను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎంతసేపు ఎదురు చూసినా డాక్టర్‌గారు రాలేదు. డాక్టర్‌ ఆసుపత్రికి ఆలస్యంగా రావడం రోజూ జరిగేదే అని అక్కడి అని అక్కడి జనాలు చెప్పుకుంటున్నారు. రాజుకు కంగారుగా ఉంది. మరోపక్క విపరీతమైన కోపం వచ్చింది.

డాక్టర్‌ తీరికగా రాత్రి 7.30కు వచ్చాడు. రాజు డాక్టరును నిలదీశాడు. సమయపాలన పాటించకపోతే పేషంట్ల పరిస్థితి ఏమిటని గట్టిగా అడిగాడు. అప్పుడు డాక్టర్‌ ‘రాజు అంటే నువ్వే కదా! మా అమ్మాయిశ్రావణి నీ క్లాస్‌మేట్‌. నువ్ఞ్వ రోజూ స్కూలుకు ఆలస్యంగా వస్తావట?నువ్ఞ్వ సమయపాలన గురించి నాకు చెబుతావా? అని పగలబడి నవ్ఞ్వతాడు. రాజు ఆలోచనలో పడ్డాడు.
తన తప్పు తెలిసి వచ్చింది. సమయపాలన పాటించకపోతే ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు.
ప్రతి నిమిషం విలువైనదే. ఆ విలువైన సమయాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటాడు. తెల్లవారుజామున లేచి చదవడం, పాఠశాలకు సమయానికి వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. మరింత తెలివైన విద్యార్తి అయినాడు.

– సరికొండ శ్రీనివాసరాజు, రంగారెడ్డి జిల్లా

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/