నీతి కథ: అలవికాని స్నేహం

NEETI KADHA

మామయ్యా ఎంత చెప్పినా వినకుండా కౌశిక్‌ చెడ్డవారితో స్నేహం చేస్తున్నాడు వీటిని గట్టిగా కొట్టు అని ఫిర్యాదు చేసింది శ్రావ్య. ఏం ఎందుకు చెయ్యకూడదు? అని ఎందురు ప్రశ్న వేసాడు కౌశిక్‌. మనం
మంచివారితో మనకుతగిన వారితో స్నేహం చెయ్యాలి లేకుంటే ఏం జరుగుతుందో ఈ కథ విను నీకే తెలుస్తుంది. అంటూ కథ చెప్పడం ప్రారంభిచాడు కాశీమామయ్యా.

అనగా అనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఏనుగులు, పులులు, సింహాలు, కోతులు ఇలా అనేక జంతువ్ఞలు, పక్షులు కలసి మెలసి ఆనందంగా జీవిస్తున్నాయి. వెన్నెల రాత్రుల్లో చందమామని అతిథిగా పిలిచి సంగీత కచేరీలు ఏర్పాటుచేసుకునేవి. పాములు సన్నాయి ఊదగా,కోయిలలు పాటలు పాడేవి. కోతులు డోలు వాయించగా ఏనుగులు నాట్యం చేసేవి. గుర్రం మాత్రం గుంభనంగా కూర్చునేది. వీటి ఆటపాటలను చూసి చందమామ పులకించపోయేది. ఇలా ఉండగా ఒక పున్నమి నాటి రాత్రి పచ్చికలో తిరుగుతున్న గుర్రాన్ని పిలిచి నాతో స్నేహం చేస్తావా చల్లని వెన్నెల్లో చక్కని కథలు చెప్పుకుందాం అని అడిగింది చందమామ.

నువ్వక్కడ, నేనిక్కడ నీతో స్నేహం చెయ్యను ఫో! అంది గుర్రం గర్వంగా పాపం చందమామ చిన్నబుచ్చుకుని ఉండి పోయింది. ఆ పచ్చికలో అటూ ఇటూ గెంతుతూ పచ్చిక తింటున్న బుజ్జి బుజ్జి కుందేలు గుర్రం దగ్గరకి వెళ్లి నాతో స్నేహం చేస్తావా? అని అడిగింది. ‘వేలెడంత లేవ్ఞ నీకు నాతో స్నేహమా! అని చీదరించుకుంది. ‘నీ పొగరు నీకే నష్టం అనుకుంటూ పొదల్లోకి వెళ్లిపోయింది కుందేలు. కాసేపటి తర్వాత జింక వచ్చింది స్నేహం చేద్దామని అడిగింది. ఇలా చాలా జంతువ్ఞలు పక్షులు అడిగాయి కానీ గుర్రం మాత్రం వేటితోటి స్నేహం చెయ్యడానికి ఇష్ట పెట్టు కోలేదు. కొన్ని రోజుల తరు వాత ఆ అడవికి ఒక వేటగాడు వచ్చాడు. అడి

దగ్గర ఉన్న గుగ్గిళ్లు వాసన గుర్రం ముక్కుపుటా లను తాకింది. వేటగానితో స్నేహం చేసి అతనిదగ్గర ఉన్న రుచికరమైన గుగ్గిళ్లు ఎలాగైనా తినాలని సంకల్పించింది గుర్రం. వేటగాడు గుర్రానికి దగ్గరగా వచ్చి ‘నాతో స్నేహం చేస్తావా? అని అడిగాడు. ‘నా ముందు నువ్వెంత? నీతో స్నేహం చెయ్యను ఫో అంది గుర్రం. నాతో స్నేహం చేస్తే నీకో తాయిలం ఇస్తాను అన్నాడు వేటగాడు. ఏంటో ఆ తాయిలం చూపించు? అంది గడుసరి గుర్రం.

వేటగాడు తనవెంటే తెచ్చుకున్న గుగ్గిల్లను గుర్రంముందుంచాడు. ఇంకేముందు రుచకరమైన గుగ్గిళ్లను ఆవ్ఞరావ్ఞరు మంటూ తినేసి హాయిగా నిద్రపోయింది. ఇలా రోజూ వేటగాడు గుగ్గిల్లు తేవడం తిని గుర్రం హాయిగా నిద్రపోవడం జరిగేది. కొద్ది రోజులతారువాత వేటగాడు రావడం మానేశాడు. వేటగాడి తిండికి అలవాటు పడ్డ గుర్రం ననక లాడిపోయిం ది.

అనుకోకుండా ఒకరోజు వేటగాడు అడవికి వచ్చాడు. అతడిని చూసేసరికి గర్రానికి జివ్వ లేచి వచ్చినట్లయింది. మిత్రమా ఇన్నాళ్లు రాలేదు? అని అడిగింది ‘గుగ్గిళ్లు ఇక్కడికి దూరంగా ఉన్న కొండగుహలో ఒక ముని దగ్గర ఉన్నాయి. కళ్లుమూసుకుని వెళ్తే తప్ప అతను ఇవ్వడు అన్నాడు వేటగాడు తెలివిగా. గుగ్గిళ్లకి ఆశపడ్డ గుర్రం ‘ఓ దానికేం భాగ్యం నా కళ్లకు గంతలు కట్టి నావీపుపై కూర్చో మునివద్దకు వెళదాం అంది తన ఎత్తు పారినందుకు పొంగిపోతూ గుర్రం మీద కూర్చుని తన ఇంటి వైపు స్వారీ చేసాడు ఇంటిదగ్గర గోలుసుతో బంధించాడు. నాటినుంచి గుర్రం మనిషికి బానిసగా మారింది. ఇది గుర్రం కథ. అందుకే అలవికాని స్నేహం చేయకూడదని పెద్దలు చెప్పారు అని కథ ముగించాడు మామయ్య. నువ్ఞ్వ చెప్పినట్లు మంచివారితో స్నేహం చేస్తాను మామయ్యా అన్నాడు కౌశిక్‌.
— కాశీవిశ్వనాధం పట్రాయుడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/