బాల గేయం

మా తాత సాటిలేరు!

grand father
grand father

నాకున్నవి రెండే రెండు కన్నులు
మా తాత కళ్లజోడుతో నాల్గు కన్నులు
ముసిముసిముసి బోసినవ్వుతో
నీతులు మెరిపించి మురిపించి
కదిలించే కథల పుస్తకం మాతాత!
రీతులు నడవడికలు చెబుతూ
ఆటలు పాటలు ఎన్నో నేర్పిస్తూ
అల్లరి తగదని బుద్ధి బోధిస్తూ
బాధతో ఏడుస్తుంటే లాలిస్తూ
చేరదీసి షికార్లు చేయించు మా తాత!
ఇంటింటా తాతగార్లు ఉంటే
పిల్లలకు ముద్దుల పంట పండును
పెద్దలకు ధీమాదీవెనలందును
తాతకు ఎవరూ సాటి లేరు మరి
ప్రేమకు ప్రతిరూపం మా తాత!
తాతగారి సరి ఎవరూ పోలరు
తాతిచ్చినదే మా తలరాత
తాతాబామ్మాలేని ఇంటిలో
మురిపాలతో పాటు అన్నీలోటే
అతి త్వరత్వరగా నేతాతవుతా
తాత బాటలో సాటి మేటిగా
ధీటుగా మీసం మెలేసి పయనిస్తా!!
– యల్‌.రాజాగణేష్‌, విశాఖపట్నం

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/