వైఎస్‌ఆర్‌సిపి నేతలు దాడులకు దిగుతున్నారు

కుట్రలో భాగంగానే లోకేష్‌కు భద్రత తగ్గించారు

kala venkata rao
kala venkata rao

అమరావతి: ప్రజావ్యతిరేకతను ఎదుర్కోనలేక వైఎస్‌ఆర్‌సిపి నేతలు దాడులకు దిగుతున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి నారా లోకేష్‌పై వైఎస్‌ఆర్‌సిపి నేతల దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కుట్రలో భాగంగానే లోకేష్‌కు భద్రత తగ్గించరన్నారు. ప్రజా సంక్షేమం మరిచి రౌడీయిజం అజెండాతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సిపి రౌడీలు ఎంత రెచ్చిపోయినా వెనక్కి తగ్గేది లేదని కళా వెంకట్రావ్‌ స్పష్టం చేశారు. లోకేష్‌పై దాడికి యత్నించిన వైఎస్‌ఆర్‌సిపి నేతలపై తక్షణమై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి తీరుతామన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/