చిట్కాలు

Kitchen Tips
Kitchen Tips

బటర్‌ త్వరగా మెత్తబడాలంటే చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.
కాఫీ ఫిల్టర్‌లో కొంచెం పంచదార వేసి ఆ తరువాత కాఫీపొడి, వేడినీళ్లు పోస్తే కాఫీ టేస్టీగా ఉంటుంది.
కోడిగుడ్డు సొనలో కొన్ని పాలు లేదా ఒక టేబుల్‌ స్పూన్‌ నీళ్లు కలిపి ఆమ్లెట్‌ వేస్తే రుచికంగా ఉంటుంది. చూసేందుకు బాగుంటుంది.
కాలీఫ్లవర్‌ వండేప్పుడు ఒక టేబుల్‌ స్పూన్‌ పాలు కలిపితే దాని రంగు మారదు. పూరీలు కరకరలాడాలంటే గోధుమపిండి కలిపేటప్పుడు అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ రవ్వ లేదా బియ్యప్పిండి కలపాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/