గుండె ఆరోగ్యానికి గుమ్మడి పలుకులు

గుండె ఆరోగ్యానికి గుమ్మడి పలుకులు

అప్పుడప్పుడూ గుమ్మడి వాడినా ఆ గింజల పలుకుల్ని మాత్రం తరచూ తినేలా చూసుకోండి. వాటిలోని పోషకాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు మరి. గుమ్మడి పలకుల్లో లభించే యాంటిఆక్సిడెంట్లు శరీరానికి హానిచేసే కారకాలతో పోరాడతాయి.

శరీరాన్ని చురుగ్గా ఉంచడమే కాదు, మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయివి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లతో పాటు మెగ్నీష్యిం వంటి ఇతర పోషకాలు గుండె, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఒత్తిడి అనిపించినప్పుడు దాన్నుంచి బయటపడాలంటే కాసిని గుమ్మడి గింజల పలకుల్ని తిని చూడండి. చాలా తక్కువ సమయంలోనే సాంత్వన పొందుతారు.

అలానే వీటిలో ఉండే పీచు జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. పావుకప్పు గుమ్మడి గింజల పలుకులు తీసుకుంటే ఒక రోజులో మన శరీరానికి అవసరమైన మెగ్నీషియం సగం అందినట్లే. గుండెకు రక్తప్రసరణ సజావుగా సాగడంతోపాటు ఎముకలూ, పళ్లు కూడా దృఢంగా ఉంటాయి. ఈ గింజల్ని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య కూడా అదుపులో ఉంటుంది. వీటిలో జింక్‌ అధికంగా లభిస్తుంది.

శరీర కణాల వృద్ధికీ, కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ పోషకం ఉపయోగపడుతుంది. గుమ్మడి గింజల్లో సహజంగా ఫైటో ఈస్ట్రోజెన్స్‌ శరీరంలో మంచి హెచ్‌డిఎల్‌ను పెంచుతాయి. శరీరంలో వేడి ఆవిర్లు, తలనొప్పులు, కీళ్లనొప్పులు వంటి మెనోపాజ్‌ సూచనల్ని అదుపులో ఉంచుతాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/