మహిళలకు బిఆర్ఎస్ టికెట్లు ఇచ్చిన తర్వాత కవిత మాట్లాడాలిః కిషన్ రెడ్డి

కవిత లేఖలకు కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి

kishan-reddy-counter-to-kavitha

హైదరాబాద్‌ః ఈ నెలలో జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని అన్ని రాజకీయ పార్టీలకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కవితకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్ బిల్లులో పేర్కొన్న ప్రకారం బిఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్లను మహిళలకు కేటాయించిన తర్వాత కవిత మాట్లాడాలని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశాన్ని అసెంబ్లీలో బిఆర్ఎస్ లేవనెత్తాలని సెటైర్ వేశారు. ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో మహిళలకు రిజర్వేషన్ ను పాటించిన తర్వాతే దానిపై మాట్లాడే హక్కు బిఆర్ఎస్ కు ఉంటుందని అన్నారు. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో కేవలం ఏడుగురు మహిళలు మాత్రమే ఉన్నారు.