భారీ వరద.. శ్రీరామ్‌సాగర్‌కు 15 గేట్లు ఎత్తివేత

sriramsagar-project-15-gates-opened-with-huge-flood-water

నిజామబాద్ః ఎగువనుంచి భారీగా వరద వస్తుండటంతో జిల్లాలోని శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి 66,340 క్యూసెక్కుల వరద వస్తుండగా, 46,800 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ఎస్సార్‌ఎస్పీలో 90.3 టీఎంసీల నీటిని నిల్వచేయవచ్చు. ప్రస్తుతం 90.313 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ఇప్పుడు 1091 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/