జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కిరణ్ కుమార్ రెడ్డి నియామకం

తక్షణమే నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు

kiran-kumar-reddy-appointed-as-member-of-national-executive-committee

న్యూఢిల్లీః ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని బిజెపి హైకమాండ్ ఆయనకు తగిన బాధ్యతలను అప్పగించింది. బిజెపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఆయనను నియమించింది. తద్వారా ఆయన సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోనుంది. కిరణ్ రెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది.