18న ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల కర్ర పూజ

కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌ వెల్లడి

Mahaganapati celebrations
Mahaganapati celebrations

Hyderabad: ఏటా ఘనంగా నిర్వహించే ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవాలను 66వ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించాలని ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు.

ప్రతి ఏటా తొలి ఏకాదశి రోజు కర్ర పూజ నిర్వహించి ప్రారంభించే పనులను ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

కర్రపూజలో పాల్గొనే వారు మాస్క్‌ ధరించి, సామాజిక దూరం పాటించాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌ అన్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తితో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వినాయకుడి తయారీ, ఎత్తు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతే ముందుకు వెళతామని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/