సమత దోషులకు ఉరి శిక్ష

తుది తీర్పు వెల్లడించిన కోర్టు

convicts-death-sentence
convicts-death-sentence

ఆదిలాబాద్‌: కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన సమత అత్యాచారం కేసులో ముగ్గురు దోషులకు
376 డీ సెక్షన్ కింద ఉరి శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2019 నవంబర్ 24న కొమ్రం భీం జిల్లా లింగాపూర్‌ అటవీ ప్రాంతంలోని లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగింది. గొంతు కోసి ఆమెను దారుణంగా హతమార్చారు. నవంబరు 25న ఆమె మృతదేహం లభ్యమైంది. మృతదేహం పలు చోట్ల బలమైన గాయాలు కనిపించాయి. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగించే బాధితురాలు ఒంటరిగా ఉండటం గమనించి ముగ్గురు వ్యక్తులు అపహరించారు. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక హత్యాచారం హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ కేసు విచారణను తీవ్రంగా పరిగణించిన పోలీసులు 20 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. డిసెంబర్ 14న ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. ముగ్గురు నిందితులు షేక్‌ బాబా, షేక్‌ షాబుద్దీన్, షేక్‌ మగ్దూమ్‌లు సమతను అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/