రాహుల్ జోడో యాత్ర కు కేజీఎఫ్ చిక్కులు

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కెజిఎఫ్ చిక్కులు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం రాహుల్ యాత్ర తెలంగాణ లో ఫుల్ జోష్ గా సాగుతుంది. ప్రతి చోట అభిమానులు , కార్య కర్తలు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో కార్యకర్తల్లో జోష్ నింపేందుకు నేతలు పలు హుషారైన పాటలను ప్లే చేస్తున్నారు. ఈ క్రమలోనే కేజీఎఫ్-2 పాట కూడా ప్లే చేసారు. అయితే.. ఇప్పుడు ఆ సినిమా పాటలు వాడుకోవటంపై హక్కులు కలిగిన సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది.

బెంగళూరుకు చెందిన ఎమ్మార్టీ మ్యూజిక్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, సుప్రియా శ్రీనటే.. కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ పిర్యాదు చేసింది. కేజీఎఫ్-2 హిందీ వెర్షన్ పాటలపై హక్కులను సొంతం చేసుకునేందుకు పెద్ద మొత్తంలో చెల్లించామని పేర్కొంది. అనుమతి లేకుండా భారత్ జోడో యాత్రకు తమ పాటలను వాడుకుంటున్నారని ఆరోపించింది. పాటల బ్యాక్ గ్రౌండ్‌తో పలు వీడియోలు కూడా రూపొందిస్తున్నారని ఆరోపించింది. ఎమ్మార్టీ మ్యూజిక్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీ సహా ఇతర నేతలపై ఐటీ లా ప్రకారం 403, 465, 120, 34, సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 63 కాపీరైట్ యాక్ట్ 1957 కింద మరో కేసు నమోదు చేశారు.