ఓ ఇంటివాడైన జబర్దస్త్ ఫేమ్ కెవ్వు కార్తీక్

జబర్దస్త్ ఫేమ్ కెవ్వు కార్తీక్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రస్తుతం సినీ , బుల్లితెర నటి నటులంతా వివాహం చేసుకొని సెటిల్ అవుతున్నారు. రీసెంట్ గా హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోగా..తాజాగా జబర్దస్త్ ఫేమ్ కెవ్వు కార్తీక్ వివాహం చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. గురువారం కెవ్వు కార్తీక్ వివాహం హైదరాబాద్‌లో జరిగింది. వీరి పెళ్లికి బుల్లి తెర సహ నటులు, సినీ ప్రముఖులు హాజరయ్యి నూతన దంపతులను ఆశ్వీరదించారు. వీరి వివాహానికి గెటప్ శ్రీను దంపతులు కూడా హాజరయ్యారు.

ఈ విషయాన్ని శ్రీను తన ఇన్ స్టా ఖాతాలో ఫోటో షేర్ చేసి..జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వరంగల్‌కు చెందిన కెవ్వుకార్తీక్.. చదువు పూర్తయ్యాక సినిమాలపై మక్కువతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కామెడీ క్లబ్ తో కెరీర్‌ను స్టార్ చేస్తూ.. అంచలు అంచలుగా ఎదిగారు. ఇటీవల విడుదలైన నేను స్టూడెంట్ సర్ సినిమాలో కనిపించారు.